మగ అమ్మోరు గోపి అనుమానాస్పద మృతి

అతనిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. దొంగ స్వామిగా ముద్రపడిన గోపి మగ అమ్మవారిగా తనను తాను అభివర్ణించుకున్నాడు. గత నెలలో తాను షోలాపూర్ అమ్మవారికి జన్మనిస్తానని ప్రచారం చేసుకున్నాడు. అమ్మవారి మహాత్యం వల్ల తాను మగవాడిని అయినప్పటికీ పిల్లలు పుడతారని ఆయన చెప్పేవాడు.
చుట్టు పక్కల ప్రాంతాలలో ఆయన చాలామందిని భక్తులను చేసుకున్నాడు. పక్క రాష్ట్రంలో కూడా భక్తులు తయారయ్యారు. ఈ వ్యవహారంపై మీడియాలో ప్రధానంగా రావడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను మూడు రోజుల క్రితం బెయిల్ పైన విడుదలయ్యాడు. మగ అమ్మోరిగా చలామణి అయిన గోపి ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాంశమయింది.












Click it and Unblock the Notifications