జగన్‌ను విడుదల చేయకపోతే తిరుగుబాటు: సబ్బం

తండ్రి రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం జగన్ కాంగ్రెస్‌పార్టీని వీడి ప్రజల మధ్యకు రావడాన్ని సహించలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. సిబిఐ, జ్యుడీషియల్ విభాగాలు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించకూడదని ఆయన అన్నారు.
తమ నేత జగన్ దోషి అయితే తగిన ఆధారాలు చూపించాలని, దానిలో ఎంత మాత్రం తప్పులేదన్నారు. జగన్‌ను జైలుకే పరిమితం చేయాలన్న కుట్రను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, పూడి వెంకటపతిరావు, పలువురు వైయస్సార్ కాంగ్రెసు నేతలు పాల్గొన్నారు.
సబ్బం హరి ఇంకా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయలేదు. అయినా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు వైయస్ జగన్ వైపు వచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications