హైదరాబాద్ మా అమ్మ సొత్తు: సమైక్యాంధ్ర జెఏసి

సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విద్యార్థి చైతన్య సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావూరి, లగడపాటి సహా పలువురు వచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడి తెలంగాణలో వేర్పాటువాదం వినిపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఓ వ్యాపారం అని, పెట్టుబడులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ఆదాయం వేర్పాటువాదుల సొంతంగా అభివర్ణించారు.
విద్యార్థులు, ఉద్యోగులకు ఆశలు చూపించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు తల్లిని నమ్ముకున్న ఎంతో మందికి తెలంగాణ వేర్పాటువాదులు తూట్లు పొడుస్తున్నారన్నారు.
ఎలాంటి ఉద్యమానికైనా విద్యార్థులు, యువతే బలమన్నారు. విద్యార్థులకు అండగా తాము ఉంటామని వారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి వరకు విద్యార్థులు అంటే అందరికీ వణుకు అని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. హైదరాబాద్ మా అమ్మ సొత్తు అని వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications