ఢిల్లీ గ్యాంగ్ రేప్: విషమం, సింగపూర్‌కు బాధితురాలు

బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులు, ఇప్పటివరకు చికిత్స అందించిన సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలోని ఇద్దరు సీనియర్ హృద్రోగ నిపుణులు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్‌కు వెళ్లారు. ఆ ఎయిర్ అంబులెన్స్‌లోనే ఐసీయూ సౌకర్యం కూడా ఉంది. బాధితురాలి విషయంలో ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. దీనిపై కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ చర్చించారు.
సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి అప్పటికప్పుడే అందరికీ వీసాలు మంజూరు చేయించారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్యం, భద్రత కల్పించే విధంగా ఆ ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నారు. బాధితురాలికి ఇన్‌ఫెక్షన్ రాకుండా తొలగించిన చిన్న పేవుల స్థానంలో దాతల నుంచి సేకరించిన అవయవాలను అమర్చేందుకు సిద్ధమైంది. బాధితురాలికి అవసరమైన అన్ని రకాల సహాయం అందించాలని సింగపూర్‌లోని భారత హైకమిషన్‌ను ఆదేశించింది.
ఆమె విషయంలో భారత దేశ ప్రతినిధి స్థాయిలో వ్యవహరించాలని సూచించింది. ఆమె చికిత్సకు అయ్యే వ్యయం మొత్తాన్నీ ప్రభుత్వమే భరించనుంది. బాధితురాలిని తరలించనున్న మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి అని, అందువల్ల ఆ ఆస్పత్రిలో ఆమెకు చిన్న పేగుల మార్పిడి శస్త్రచికిత్స చేయించనున్నట్లు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బీడీ అథానీ చెప్పారు. ఆమెకు చికిత్స అందించేందుకు కొన్ని వారాలు పట్టవచ్చని తెలిపారు.
బాధితురాలిని సింగపూర్‌కు తరలించడానికి ముందు ఆమె తండ్రి మీడియాతో మాట్లాడారు. "మాకు ఏ విషయం తెలియదు. విదేశానికి వెళ్తున్నామని మాత్రమే చెప్పారు. ఎక్కడి వెళ్లేదీ? ఆమె పరిస్థితి ఏమిటి? అనే వివరాలేమీ మాకు చెప్పలేదు. మా కుటుంబం మొత్తం ఆమెతో వెళ్తున్నాం'' అని ఆయన చెప్పారు.
తన కూతురు జీవితంతో పోరాడి అలిసిపోయిందని బాధితురాలి తల్లి తనను కలిసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు చెప్పారు. ఈ ఇద్దరు రెండురోజుల క్రితం బాధితురాలి తల్లిదండ్రులను కలుసుకున్నారు. ఐసీయూకు వెళ్లి బాధితురాల్ని చూసేందుకు ఈ ఇద్దరికీ ధైర్యం చాల్లేదు. తమ అధికారాల్ని ఉపయోగించి ఐసీయూలోకి వెళ్లాలనుకోలేదని వారు చెప్పారు. ఆమె తల్లిదండ్రులిద్దర్నీ చూసి రేణుకాచౌదరి, మీరాకుమార్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా మెడ్‌వారాకలాన్ గ్రామం నుంచి కుమార్తెతో పాటు వచ్చి ద్వారకలోని మహావీర్ ఎన్‌క్లేవ్‌లో చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. తమ కుమార్తె చదువుకోసం వారు తమ పొలాన్ని కూడా అమ్ముకుని ఢిల్లీకి వచ్చారు. గురువారం ఉదయానికి బాధితురాలు సింగపూర్ చేరుకుంది.












Click it and Unblock the Notifications