మహిళల కోసం ఉద్యమిస్తుండగానే..: లోకేష్ మరో ట్వీట్

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్‌లో మరో ట్వీట్ చేశారు. హెరిటేజ్‌పై దాడిని నిరసిస్తూ... లోకేష్ ట్వీట్ చేశారు. మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయంటూ భారత దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుండగానే కొందరు హెరిటేజ్ స్టోర్స్ పైన దాడి చేసి మహిళలపై అటాక్ చేశారన్నారు. వారిని ఎవరిని పంపించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరోవైపు ట్విటర్‌లో లోకేశ్ సవాల్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, కెటి రామారావులు జవాబు చెప్పాలని తెలుగు యువత ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలకు కట్టుబడతారా? లేదా అని అడిగితే ఎందుకలా ఉలిక్కిపడుతున్నారని తెలుగు యువత నేతలు మద్దిపట్ల సూర్య ప్రకాష్, నిడదవోలు ఉదయభాస్కర్ అడిగారు.

హరీష్‌ రావు మాటమీద నిలబడే వ్యక్తే అయితే, ఎన్టీఆర్ భవన్‌లో అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నగదు బదిలీ పథకం గురించి తొలుత చెప్పింది లోకేష్ అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తెలంగాణ అన్న పదమే లేదంటున్న టిఆర్ఎస్ నేతలు, మరి ఏ లేఖ చూసి 2009 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

2008లో ప్రణబ్‌ముఖర్జీకి టిడిపి ఇచ్చిన లేఖ గురించి కెటి రామారావుకు తెలియక మాట్లాడుతున్నారన్నారు. ఆ లేఖ ఇచ్చిన తర్వాతే టిడిపితో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని తెలిపారు. ఉద్యమం ముసుగులో దోచుకోవడం కెసిఆర్‌కు అలవాటే అన్నారు. ఆలె నరేంద్రను తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని, ఆనక వెన్నుపోటు పొడిచిందెవరో అందరికీ తెలుసునన్నారు. కెసిఆర్ చరిత్ర గురించి కెటిఆర్‌కు తెలియకపోతే, ఉమేష్‌ రావును అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+