వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాక్లెట్ల ఆశ చూపి ఏడేళ్ల బాలికపై యువకుడు రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Young molested 7yr old girl
ఒంగోలు/నల్గొండ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే మృగాళ్లు రెచ్చిపోతున్నారు. కామవాంఛలు తీర్చుకోవడానికి వయస్సును కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో నిన్న రాత్రి దారుణం జరిగింది. ఏడేళ్ల ఓ బాలిక పైన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిన్న తోటి చిన్నారులతో కలిసి ఆ బాలిక అడుకుంటోంది.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన సదరు యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఏడేళ్ల బాలికను తన ఇంటికి తీసుకు పోయాడు. అక్కడ తన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

నల్గొండలో నాలుగేళ్ల బాలికపై పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జిల్లాలోనే మరోచోట బాలికతో ఒకరు అనుచితంగా ప్రవర్తించాడు. కారులో బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. స్థానికులు అడ్డుకున్నారు.

కాగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లోబర్చుకొని అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పెనమలూరు కానిస్టేబులు పైన కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు. కాగా కృష్ణా జిల్లాలో సాక్షాత్తూ ఓ కానిస్టేబుల్ ఒక మహిళను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే.

పెనమలూరు సిఐ ధర్మేంద్ర కథనం ప్రకారం... ఐదేళ్ల కిందట వివాహమైన మహిళ, భర్తతో మనస్పర్థల వల్ల అతనితో విడిపోయి మరో వ్యక్తిని పెళ్లాడింది. అయితే, వారిద్దరి మధ్య కూడా పొరపొచ్చాలు రాగా రెండో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచీ తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. తన ఫిర్యాదుకు సంబంధించి తరచూ స్టేషన్‌కు వస్తున్న ఆమెను ఈస్ట్‌జోన్ సిసిఎస్ విభాగం కానిస్టేబుల్ వీర వెంకట్రావ్ గమనించాడు.

ఆమెకు మాయమాటలు చెప్పి కంకిపాడులోని ఓ మహిళా హోంగార్డు నివాసంలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో ఆమెను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో మంగళగిరి మేయర్స్ హోమ్‌లో చేరింది. రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో తిరిగి పుట్టింటికి చేరింది. ఆ తర్వాత అత్యాచారం చేసిన కానిస్టేబుల్ వద్ద కొచ్చి తనను భార్యగా స్వీకరించాలని కోరింది.

అందుకు అతడు నిరాకరించడంతో నగర పోలీసు కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు సిఐ ధర్మేంద్ర బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

English summary
Krishna district Police filed a case against constable on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X