16 ఏళ్ల అమ్మాయిపై మళ్లీ న్యూఢిల్లీ బస్సులోనే: అరెస్టు

Teenager molested in bus in New Delhi, conductor arrested
న్యూఢిల్లీ: బస్సులో గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు చెలరేగుతుండగానే భారత రాజధాని ఢిల్లీలో మరో ఘటన చోటు చేసుకుంది. పదిహేను రోజుల క్రితం ఓ అమ్మాయి బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె శుక్రవారం అర్ధరాత్రి(తెల్లవారితే శనివారం) రెండున్నర గంటలకు సింగపూరులోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో శనివారం రాత్రి ఢిల్లీలోనే బస్సులో మరో మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై బస్సు డ్రైవర్, కండక్టర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. అమ్మాయిని కండక్టర్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.

అమ్మాయి వయస్సు పదహారు ఉంటుంది. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో జరిగింది. అమ్మాయి రాత్రి పూట్ బస్సు ఎక్కింది. మండి ప్రాంతానికి బస్సు పదకొండు గంటల సమయంలో చేరుకుంది. ఈ సమయంలో కండక్టర్‌తో పాటు మరో వ్యక్తి ఆమెను వేధించారని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి రాత్రి తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి తన కుటుంబంపై అలక వహించి బయటకు వచ్చింది. ఈ బస్సు ఖయాలా నుండి లజపతి నగర్‌కు వెళుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+