వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలలో తెలంగాణ.. నమ్మట్లేదు, కాళ్లు పట్టుకుంటా: కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Keshava Rao
హైదరాబాద్: నెల రోజుల్లో తెలంగాణ వచ్చే పరిస్థితి లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించినట్లుగా జనవరి 30లోగా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకైతే లేదన్నారు. నెలరోజుల్లోగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కేంద్రం ప్రకటించినా తనకు నమ్మకం లేదన్నారు.

ఒకవేళ జనవరి 30లోపు తెలంగాణ రాకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఏం చేయాలో అది చేస్తామన్నారు. ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణవాదానికే ఓట్లు వేద్దామని, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మనం ఒకరికొకరు విమర్శలు చేసుకోవద్దన్నారు. తెలంగాణ కోసం కలిసి వచ్చేవారు ఎవరున్నా వారింటికి వెళ్లి కాళ్లు పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

తెలంగాణ ద్రోహులకు మాత్రం బుద్ధి చెప్పాలన్నారు. తమ పార్టీ కాంగ్రెస్‌ను బొంద పెడదామని కొందరు తిట్టినా తాను కమిట్‌మెంట్‌తో తెలంగాణ సభలు, ఉద్యమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా అదే నిబద్ధతతో ఉద్యమిస్తున్నారన్నారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ ముందుకు వచ్చారని, అదే జరిగితే అసెంబ్లీ నడిచేది కాదని ఆయన చెప్పారు.

కానీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయాల్సినంత చేయకపోతే తెలంగాణ రాదన్నారు. తన ఊపిరి, ప్రాణం, రక్తం తెలంగాణ అన్నారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీలు, సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

ఇది పార్టీల ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమమన్నారు. జెఏసి ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా ఐక్యంగా కదలడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జనవరి 26లోపు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన వచ్చేలా ఒత్తిడి తేవాలని అధికార పార్టీ నేతలను జెఏసి చైర్మన్ కోదండరామ్ కోరారు.

English summary
Senior Congress leader K. Keshava Rao threw a bombshell on Sunday by saying that he did not trust his party to concede separate Telangana at the end of the month-long deadline that it had set for itself following the all-party meeting on the statehood issue at New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X