అది అసలురూపం: బాబుపై ఈటెల, రాళ్లతోదాడి: హరీష్

తెలంగాణ కోసం వెయ్యి మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు ఒక్కరిని కూడా పరామర్శించలేదని విమర్శించారు. అలాంటి చంద్రబాబును తెలంగాణవాదులు ఎవరూ నమ్మరన్నారు. నెల రోజుల్లో కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల నుండి డబ్బులు తీసుకొని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోటరీ తెలంగాణను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.
ఇటుకలతో కొడితే రాళ్లతో కొడుతాం
కృష్ణా జిల్లా విజయవాడలో తొర్రూరు డిపో బస్సు పైన దాడి చేయం సరికాదని సిద్దిపేట తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాదులో అన్నారు. బస్సులపై సీమాంధ్రులు ఇటుకలతో దాడి చేస్తే తాము రాళ్లతో కొడతామని హెచ్చరించారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ల పైన దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
టిడిపి నర్సారావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రకటనతో తెలంగాణపై టిడిపి నిజ స్వరూపం బయటపడిందన్నారు. టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉన్నదే నిజమైతే వేణుగోపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. లేదంటే ఆ పార్టీని సమైక్యవాద పార్టీగానే గుర్తిస్తామన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications