Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళా కానిస్టేబుల్‌కు ఎసిపి అసభ్యకర మెసేజ్‌లు

Mumbai
ముంబయి: మహారాష్ట్రలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు అసభ్యకర ఎస్సెమ్మెస్‌లు పంపించిన ఎసిపిపై కేసు నమోదైంది. ఔరంగాబాద్ నుంచి రత్నగిరికి బదలీ అయిన ఎసిపి సందీప్ భజిభాక్రే, మరో ఇద్దరు ఎసిపిలు తనని మానసికంగా, శారీరకంగా హింసించారని ఇటీవల కాలంలో మూడుసార్లకు పైగా కనిపించకుండా పోయిన ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయమని పోలీసులు కమిషనర్ సంజయ్ కుమార్ ఆదేశాలిచ్చారు.

మహిళా కానిస్టేబుల్‌కు సందీప్ 70 అసభ్యకర సందేశాలు పంపినట్లు మహిళా ఫిర్యాదుల పరిష్కార కేంద్రం ప్రతినిధుల విచారణలో వెల్లడయింది. దీంతో కమిషనర్ సూచనల మేరకు సందీప్ పైన కేసును నమోదు చేశారు. సందీప్ పైన సెక్షన్ 509 కేసు నమోదు చేశారు.

గుజరాత్‌లో...

ఆదివారం గుజరాత్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రెండేళ్లుగా తన కన్నకూతురిపై మహేష్ (50), అత్యాచారానికి ఒడిగట్టగా.. ఆ బాధితురాలిని రెండు నెలలుగా తన అన్నయ్య హృదిక్ (20) కూడా మాన భంగం చేస్తూ వస్తున్నాడు. ఇది భరించలేక ఇంటి నుంచి పారిపోయిన బాధితురాలు (19), తన స్నేహితులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సుల్తాన్ పరిధిలో 15 ఏళ్ల దళిత బాలికను ధారావళి గ్రామంలో 15 రోజుల పాటు ముగ్గురు అత్యాచారం చేసి శనివారం వదిలేశారు. రాజును ప్రధాన నిందితుడిగా, బసంత్‌లాల్, షహబ్దీన్ లను ఇందుకు సహకరించినట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్ పరిధిలోని బారాసత్‌లో 45 ఏళ్ల వయసుగల మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం దుండగులు ఆమెను హత్య చేయగా, మృతురాలి భర్తపై కూడా వారు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ విషయమై మృతురాలి కుమారుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో యువతి గ్యాంగ్‌రేప్‌నకు గురైన ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+