గ్యాంగ్ రేప్: అతను బాయ్ ఫ్రెండ్ కాదు.. కాబోయే భర్త

New Delhi
న్యూఢిల్లీ: పదిహేను రోజుల క్రితం బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురై రెండు రోజుల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి గ్యాంగ్ రేపు జరిగిన రోజు రాత్రి వెళ్లింది బాయ్ ఫ్రెండ్‌తో కాదని, తనకు కాబోయే భర్తతో అని తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలో జరగాల్సి ఉండెనని యువతి ఇంటి సమీంలోని వారు చెబుతున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి... పది రోజుల్లో నిశ్చితార్థం ఉన్న నేపథ్యంలో పెళ్లి దుస్తులు, నగలు కొనుక్కునేందుకు ఇద్దరి కలిసి షాపింగ్‌కు వెళ్లారు.

తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి ఏర్పాట్లు సాగుతున్న సమయంలో జనవరిలో నిర్వహించనున్న నిశ్చితార్థానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు దుస్తులు, ఇతర నగలు కొనుక్కోవడానికే వారు షాపింగ్‌కు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇరుగు పొరుగు మహిళలు చెప్పారు. ఆ ఘటనలో ఆమెతో ఉన్న వ్యక్తి ఒకరు గాయపడ్డ విషయం తెలిసిందే.

కాగా ఢిల్లీ అత్యాచార బాధిత యువతి మృతదేహానికి ఉత్తర ప్రదేశ్‌లోని ఆమె సొంత గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని తొలుత అధికారులు చెప్పారు. అయితే చివరకు ఢిల్లీలోనే జరిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+