వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఎన్నారై హత్య: ద్వేషంతో అన్న యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunando Sen
వాషింగ్టన్: అమెరికాలో రెండు రోజుల క్రితం ప్రవాస భారతీయుడు సునందో సేన్‌ను ఓ మహిళ రైలు కిందకు తోసేసి హత్య చేసింది. ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగింది. సునందో మృతికి కారకురాలైన మహిళ పైన హత్యా నేరం అభియోగాలు నమోదు చేశారు. పోలీసులు. తాను హిందువులను, ముస్లింలను ద్వేషిస్తానని, అందుకే అతనిని రైలు పట్టాలపై తోసేశానని సదరు మహిళ ఎరికా మెనెండేజ్ విచారణలో తన నేరాన్ని అంగీకరించింది.

దీనిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిపింది. జాలి కూడా లేదన్నది. నేరం రుజువైతే అమెకు 25 ఏళ్ల జైలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27న న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ సబ్ వే ప్లాట్ ఫాంపై ఆమె సునందో సేన్‌ను తోసేసింది. ఆమెను పోలీసులు శనివారం క్వీన్స్ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

ఈ సందర్భంగా ఎరికా కోర్టులో విచిత్రంగా వ్యవహరించంది. ఆమెపై నమోదైన నేరాభియోగాలను ప్రాసిక్యూటర్లు చదివేటప్పుడు ఎరికా నవ్వింది. దీనిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ప్రవర్తించవద్దని సూచించినట్లుగా న్యూయార్క్ డైలీ న్యూస్ కథనంలో పేర్కొంది.

2001 సెప్టెంబర్ 11న అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడులు జరిగినప్పటి నుండి తాను ముస్లింలు, హిందువులపై ద్వేషం పెంచుకున్నానని ఆమె చెప్పారు. కాగా సునందో సేన్ అంత్యక్రియలు సోమవారం న్యూయార్క్‌లో నిర్వహించనున్నారు.

English summary
A heavyset Hispanic woman — seen by five witnesses 
 
 pacing and mumbling to herself — pushes a helpless 
 
 Sunando Sen in front of an oncoming Flushing-bound 
 
 No. 7 train in Queens. She was caught on tape while 
 
 fleeing the crime scene, police said. Sen co-owned 
 
 New Amsterdam Printing Co. in Manhattan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X