కోటి సంతకాల సేకరణ: జగన్ పార్టీలోకి దర్శి ఎమ్మెల్యే!

Siva Prasad
ఒంగోలు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వెళతారనే ప్రచారం జరుగుతోంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ విడుదల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోటి సంతకాల సేకరణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు సంతకాలను సేకరిస్తున్నారు.

కోటి సంతకాల సేకరణలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి కూడా సంతకం చేశారు. జగన్ విడుదలను కాంక్షిస్తూ ఆయన సంతకం చేయడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ సంతకాల సేకరణను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.

కాగా జగన్ జైలులో ఉండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై జైలులో ఉన్న కారణంగా తమ పార్టీ 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం చెప్పారు. జగన్ ‌అరెస్టుకు నిరసనగా తాము నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవద్దని నిర్ణయించుకున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+