గెంటేసినా పార్టీ వీడను: కాసు, కావూరి వెళ్లరు: పితాని

సరైన సమయంలో పార్టీ అధిష్టానం కావూరికి గౌరవప్రదమైన పదవి ఇస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సహకార సంఘాలకు రూ.2 లక్షల ప్రోత్సాహక బహుమతులను ఇస్తామన్నారు. కార్యకర్తల మనోభావాలను వెలికి తీయడం కోసమే విజయవాడలో కాంగ్రెసు పార్టీ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. స్నేహం వేరని రాజకీయాలు వేరన్నారు. ఇతర పార్టీల నేతలతో స్నేహ సంబంధాలు అందరికీ ఉంటాయన్నారు.
తన తనయుడు కాంగ్రెసు పార్టీలో చేరతారనే వార్తలను ఆయన కొట్టి పారేశారు. తన తనయుడు, జగన్ కలిసి చదువుకున్నారని, అందుకే వెళ్లి కలిశాడన్నారు. కానీ జగన్ పార్టీలో చేరరన్నారు. తన కొడుకు రక్తంలోనూ కాంగ్రెసు రక్తమే ఉందన్నారు.
కావూరి విషయం అధిష్టానం...
ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అసంతృప్తి విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. కావూరి ఏ పార్టీలోకి వెళ్లరన్నారు. ఆయన ఎప్పుడూ కాంగ్రెసు పార్టీలోనే ఉంటారని చెప్పారు. ఆయన ఆవేదన పార్టీ అధిష్టాన విన్నదని చెప్పారు.
ఆయనకు సరైన సమయంలో సరైన ప్రాధాన్యత అధిష్టానం ఇస్తుందని చెప్పారు. రాజకీయాల్లో వలసలు కొత్తేమీ కాదన్నారు. ఎప్పుడూ ఇవి ఉంటూనే ఉంటాయని చెప్పారు. 2014లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెసులోకి మళ్లీ వస్తారు
పార్టీని వీడిన వారు తిరిగి వస్తారని జెడి శీలం అన్నారు. విజయవాడ సదస్సులో సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం ఉండదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది వెళ్లారని, తిరిగి వచ్చారన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications