పివి ఎక్స్‌ప్రెస్ హైవేపైనుండి పడిన కారు: ప్రేమించలేదని..

Accident on PV Express way
హైదరాబాద్: పివి నరసింహా రావు ఎక్స్‌ప్రెస్ వే పైన బుధవారం ప్రమాదం చోటు జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. పివి ఎక్స్‌ప్రెస్ వే పై నుండి వెళ్తున్న ఓ కారు మరో కారును తప్పించబోయి పై నుండి కింద పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదం 194వ పిల్లర్ వద్ద చోటు చేసుకుంది. కారు కింద పడినప్పటికీ గాయాలతో బయటపడ్డారు. కింద ఉన్న పలువురికి కూడా గాయాలయ్యాయి. కారు కింద పడటంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

కుటుంబం ఆత్మహత్య

హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా నివసించే రాజు అనే వ్యక్తి తన భార్య, కొడుకు, కూతురుతో కలిపి విషం తాగాడు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందారు. తండ్రి, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రేమించలేదని గొంతుకోశాడు

ఈఎస్ఐలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఎర్రగడ్డలోని ఈ ఆసుపత్రిలో తన సహోద్యోగినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో ఆమె గొంతు కోశాడు. పోలీసులు బాధితురాలని చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+