• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ రేప్: బస్సు చక్రాల కింద నలిపేయాలనుకున్నారు

By Pratap
|

 Delhi Gangrape: Accused tried to run victim over with bus
న్యూఢిల్లీ: అత్యాచారం చేసిన అనంతరం వైద్య విద్యార్థినిని కీచకులు ఆమెపై నుంచి బస్సును నడిపించి హత్య చేయాలని ప్రయత్నించారు. బస్సులోంచి బయటకు తోసేసిన తర్వాత నిర్భయను ఆ బస్సు టైర్ల కింద నలిపేయాలని చూశారు. కానీ చివరి క్షణంలో మిత్రుడు ఆమెను పక్కకు లాగేశాడు.

ఈ కేసుపై అభియోగపత్రంలో పోలీసులు ఈ వివరాలను క్రోడీకరించినట్లు తెలుస్తోంది.

పోలీసువర్గాల కథనం ప్రకారం - దక్షిణ ఢిల్లీలోని మునిర్కా బస్సు స్టాప్‌లో 'నిర్భయ', ఆమె మిత్రుడు బస్సు ఎక్కారు. అప్పటికే అందులో ఐదుగురు ఉన్నారు. వారు కూడా తమలాగే ప్రయాణికులని వారు భావించారు. కానీ.. బస్సు కదిలిన కాసేపటికే అసలు విషయం ప్రారంభమైంది. వారంతా 'నిర్భయ'పై, ఆమె స్నేహితుడిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.

కోపం వచ్చి ఆమె స్నేహితుడు ఒకరిపై చేయి చేసుకోగా గొడవ మొదలైంది. దీంతో దుండగులు ఇనుపరాడ్లతో అతడిని విపరీతంగా కొట్టారు. అడ్డువచ్చిన ఆమెనూ వదల్లేదు. నిందితుల్లో అక్షయ్‌కుమార్, ఇంకో బాలుడు కలిసి 'నిర్భయ'ను బస్సు వెనుక సీట్లవద్దకు లాక్కెళ్లారు. తర్వాత మిగతావారూ అత్యాచారానికి పాల్పడ్డారు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్షయ్, రామ్‌సింగ్, వినయ్‌శర్మలను ఆమె కొరికింది. దాంతో ఆమెను మరోసారి తీవ్రంగా కొట్టారు.

చివరకు 'నిర్భయ'ను, ఆమె స్నేహితుడిని బస్సులోంచి నడిరోడ్డుపై తోసేశారు. అంతటితో వదలక అదే బస్సు టైర్లకు వారిని బలిచేయాలని చూశారు. తమవైపు బస్సు వేగంగా వస్తుండటం గమనించిన 'నిర్భయ' స్నేహితుడు చివరి క్షణంలో ఆమెను పక్కకు లాగేశాడు. ఇక ఆ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా డ్రైవర్ రామ్‌సింగ్ బస్సు మొత్తాన్నీ కడిగేసి, వస్త్రాలన్నింటినీ తగలబెట్టేశాడు.

ఈ కేసులో పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పలు రకాల సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో బాధితురాలు కొరకడంతో ముగ్గురు నిందితుల శరీరాలపై పడ్డ పంటి గాట్లను సాక్ష్యంగా చూపనున్నారు. దాంతోపాటు ఆమెకు చికిత్స చేసిన సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి వైద్యుల నివేదికలు, పోస్టుమార్టం నివేదిక త్వరలోనే ఢిల్లీ పోలీసులకు అందనున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు చిరునామా ద్రువీకరణ పత్రం సమర్పించినందుకు బస్సు యజమాని దినేష్ యాదవ్‌పై మోసం కేసు నమోదైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police on Tuesday, Jan 1 revealed few more shocking information regarding the brutal gang rape in the national capital. The cops stated that after throwing the victim out of the moving bus, the accused had tried to crush her under the bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more