ఆల్‌పార్టీ ఎఫెక్ట్: విజయమ్మసభలో జగన్‌పార్టీ తెలంగానం

మొన్నటి అఖిల పక్ష సమావేశం తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మిగతా అన్ని పార్టీలకు టార్గెట్‌గా మారింది. తెలుగుదేశం, కాంగ్రెసులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు కూడా టార్గెట్ అవుతుందని అలా అయితే టిడిపి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి దాని పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని అందరూ భావించారు. కానీ టిడిపి అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరి తెలియజేసింది. దీంతో కాంగ్రెసుతో పాటు జగన్ పార్టీ ప్రధానంగా టార్గెట్ అయింది.
తెలంగాణ విషయంలో తమ పార్టీ ప్రధానంగా టార్గెట్ కావడంతో ఆ పార్టీ డిఫెన్స్‌లో పడింది. దీంతో దానిని తొలగించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. గురువారం పటాన్‌చెరులో మాజీ ఎంపిపి గూడెం మహిపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జై తెలంగాణ ప్రధానంగా కనిపించింది. ఓ వైపు జై తెలంగాణ మరోవైపు జై జగన్ అంటూ రాశారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల, స్థానిక నేతల కటౌట్‌లు పెట్టారు. ఇటీవల తెలంగాణలో తమ పట్ల వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పుంజుకుంటున్న పార్టీకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆ పార్టీ కొత్త స్టాండ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే జై తెలంగాణ అని ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు. తమ పార్టీ తెలంగాణను వ్యతిరేకించడం లేదని, సెంటిమెంట్ దృష్ట్యా తెలంగాణలో ఎవరైనా ఇలాంటిది పొందుపర్చాల్సిందేనని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారట.












Click it and Unblock the Notifications