వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై ఫైరయ్యారు: బాబు తెలంగాణ వైఖరిపై బొత్స వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై తీసుకున్న వైఖరిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరోక్షంగా తప్పు పట్టారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని తాను అంటే గతంలో తనపై సీమాంధ్ర నాయకులు విరుచుకుపడ్డారని, ఇప్పుడు వారంతా ఏమయ్యారని ఆయన అన్నారు. తెలుగుదేశం అవకాశవాద పార్టీ అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు

తెలంగాణపై అఖిల పక్ష సమావేశం పెట్టిన తర్వాత తనపై గతంలో విరుచుకుపడిన సీమాంధ్ర నాయకులంతా ఏమయ్యారని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీని ఆ సీమాంధ్ర నేతలంతా ఎందుకు తప్పు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర పడుతుందని ఆయన అన్నారు.

తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హాజరు కావడానికి వీలు కానందు వల్లనే విజయవాడ పార్టీ ప్రాంతీయ సదస్సు రద్దయిందని ఆయన చెప్పారు. ప్రాంతీయవాదంతో ఈ నెల 7వ తేదీన జరగాల్సిన సదస్సు రద్దుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ఈ సదస్సును నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆజాద్ చెప్పడం వల్లనే ప్రాంతీయ సదస్సును రద్దు చేసుకున్నామని ఆయన అన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. మతపరమైన వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన సూచించారు. లక్ష్మణ రేఖ దాటిన ఎవరిపైన అయినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆనయ అన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana has criticised Telugudesam president N Chandrababu Naidu's stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X