పాశ్చాత్య పోకడల వల్లే రేప్‌లు: ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

ఆ విధమైన నేరాలు (రేప్‌లు) ఇండియాలో జరుగుతాయి గానీ భారత్‌లో జరగవని ఆయన అన్నారు. గ్రామాల్లో, అడవుల్లో ఆ విధమైన సామూహిక అత్యాచారాలు, లైంగిక నేరాలు జరగవని, పట్టణ ప్రాంతాల్లోనే అటువంటి నేరాలు, సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రాచీన భారతీయ విలువలకు అనుగుణంగా మహిళల పట్ల గౌరవభావం ప్రదర్శించే భారతీయ విలువలకు, వ్యవహారశైలికి పట్టం కట్టాలని ఆయన సూచించారు.
భారత్, ఇండియా మధ్య హద్దులు గీయడానికి ప్రాతిపదిక ఏదీ లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్ అన్నారు. భగవత్‌కు ఇండియా, భారత్ ఏదీ తెలియదని సిపిఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. దళితులపై, ఆదివాసీలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పారు.
భగవత్ వ్యాఖ్యలు వారి మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అత్యాచారాలు ఎక్కడైనా జరుగుతాయని, అత్యాచారాలను అరికట్టాలని, అందుకు కఠినమైన శిక్షలను అమలు చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications