గ్యాంగ్ రేప్, సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ: పెళ్లి చేసుకోలేదని...

Woman
కర్నూలు/విశాఖ: కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కోడుమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన పద్నాలుగేల్ల బాలికపై క్రిస్మస్ రోజున అత్యాచారం చేశారు. క్రిస్మస్ రోజు బాలిక పనిపై ఊరి బయటకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మరోచోట ఓ ఇద్దరు వ్యక్తులు పెద్దగట్టుకు చెందిన బాలికపై అత్యాచారం చేశారు. దానిని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో బాధితులు పదిరోజులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యుదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

వేరేవారిని పెళ్లి చేసుకున్నదన్న కోపంతో ఓ యువకుడు ఓ యువతితో పాటు ఆమె కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. విశాఖ పాతనగరంలోని జలారిపేటకు చెందిన అశోక్ అదే ప్రాంతంలో ఉంటున్నాడు. పెళ్లైన యువతిని అతను కొంతకాలంగా వేధించసాగాడు.

తల్లిదండ్రులు చెప్పినా యువకుడు మానలేదు. దీంతో ఆ యువతికి పెళ్లి చేశారు. సంక్రాంతి పండుగ కోసం యువతి తిరిగి తన పుట్టినింటికి వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న అశోక్ శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. అర్ధరాత్రి సమయంలో వారింటికి వచ్చి తలుపులకు బయట గడియ పెట్టి, వారు నిద్రపోతున్న సమయంలో పెట్రోలు చల్లి నిప్పంటించాడు. కేకలు వేయడంతో స్థానికులు వారిని రక్షించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+