డైలాగులకు కొదువ లేదు: కెసిఆర్‌పై విమలక్క ధ్వజం

తెలంగాణ ఉద్యమానికి సరైన పోరాట రూపం ఇవ్వడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. పోరాటానికి సరైన రూపం ఇవ్వక పోవడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోరాడి సాధించుకోవాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోరాదని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ కోసం 2014 వరకు ఆగాల్సిన అవసరమేముందో చెప్పాలని ఆమె కెసిఆర్‌ను ప్రశ్నించారు. రాజ్యహింసను ప్రశ్నించ లేని వారు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా విజయవంతంగా నడిపించగలరని ఆమె నిప్పులు చెరిగారు. ఉద్యమం పేరుతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలన్నారు.
కాగా టోల్ గేటు ధ్వంసం కేసులో విమలక్కను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే బెయిల్ పైన విడుదలయ్యారు. విమలక్క అరెస్టును విపక్షాలతో సహా పలు ప్రజా సంఘాలు ఖండించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పెదవి విప్పలేదు. దీనిపై టిడిపి తెరాసను పలుమార్లు ప్రశ్నించింది కూడా.












Click it and Unblock the Notifications