కాదు కాదంటూనే..: సక్సెసర్... స్టాలిన్‌పై మళ్లీ 'కరుణ'

Karunanidhi - Stalin
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి మరోసారి తన తర్వాత పార్టీ వారసుడు ఎవరో చెప్పకనే చెప్పారు. ఆదివారం ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కరుణానిధి వారసుడి అంశంపై నేరుగా మాట్లాడలేదు. అయితే తన తర్వాత అళగిరి కాకుండా స్టాలినే వారసుడు అని చెప్పకనే చెప్పాడు. తన రాజకీయ జీవితం విజయవంతమవడానికి కారణం స్టాలినే అన్నారు. ఆయన స్టాలిన్ విజయవంతమైన రాజకీయ నాయకుడు అన్నారు.

అయితే అదే సమయంలో వారసుడిపై ప్రశ్నించగా.. తాను వారసుడిని ఇప్పటి వరకు ప్రకటించలేదని చెప్పారు. అదంతా మీడియా సృష్టి అన్నారు. పార్టీలో అత్యధికులు స్టాలిన్‌ను కోరుకుంటే ఆయనకే తన ఓటు అన్నారు. స్టాలిన్‌ను విజయవంతమైన రాజకీయ నాయకుడుగా పేర్కొంటే తప్పేమిటని కరుణానిధి మీడియాను ప్రశ్నించారు. వారసుడిని ప్రకటించలేదని చెప్పినప్పటికీ కరుణ తన మనసులోని మాట మాత్రం మరోసారి బయటపెట్టారు.

కాగా మూడు రోజుల క్రితం కరుణానిధి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు కరుణానిధిపై కేంద్ర మంత్రి ఎంకె అళగిరి తీవ్రంగా మండిపడ్డారు. వారసుడిని ప్రకటించడానికి డిఎంకె మఠం కాదని, పార్టీ అని ఆయన అన్నారు. పార్టీ వారసుడిని ప్రకటించడానికి పార్టీ అధినేతకు హక్కు లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ పేరును సూచిస్తూ కరుణానిధి చెన్నైలోని ఓ కార్యక్రమంలో గురువారం మాట్లాడిన విషయం తెలిసిందే.

డిఎంకెలో చాలా కాలంగా స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వ పోరు జోరుగా సాగుతోంది. స్టాలిన్ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు చూస్తుండగా, ఆయన అన్న అళగిరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. స్టాలిన్ తర్వాతనే అళగిరి రాజకీయాల్లోకి వచ్చారు. డిఎంకె శంకర మఠం కాదని కరుణానిధి గతంలో చేసిన ప్రకటనను అళగిరి గుర్తు చేశారు. స్టాలిన్‌ను తప్ప మరొకరికి వారసత్వాన్ని అప్పగించే స్థితిలో 88 ఏళ్ల కరుణానిధి లేరు.

ముఖ్యమంత్రి జయలలితను ఎదుర్కోవడానికి కూతురు కనిమొళి పనికి వస్తారని భావించినప్పటికీ ఆమె 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఇరుక్కున్నారు. జయలలితను ఎదుర్కోవడంలో స్టాలిన్ దీటుగానే వ్యవహరిస్తున్నారు. అళగిరి రాష్ట్రవ్యాప్త ప్రతిష్టను పెంచుకోలేకపోయారు. పైగా అళగిరి కుమారులు కుంభకోణాల్లో చిక్కుకున్నారు. మధురై కింగ్‌గా పేరు పొందిన అళగిరి తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించక తప్పకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+