చిరంజీవి ఫ్లాప్ కాలేదా: సినీ నటులపై చంద్రబాబు

Chandrababu Naidu
వరంగల్: సినీ నటులతో లాభం జరుగుతుందనేది సరి కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో అంటూ చిరంజీవి ఫ్లాప్ కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో సినీ నటులను వినియోగించుకోవాలనే పార్టీ నాయకుల సూచనపై ఆయన ఆ విధంగా అన్నారు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని, సినీ నటులతోనే ఏదో లాభం జరుగుతుందనుకోవడం పొరపాటు అని, అవసరాన్ని బట్టి వారిని వాడుకున్నా.. మనం కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఆయన వివరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన సోమవారంనాడు ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెయస్ రాజశేఖర్‌రెడ్డి వేల కోట్ల విలువైన బయ్యారం గనులను అల్లుడికి కట్నంగా కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. జగన్ జైల్లో నుంచే ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు.

నైతిక విలువలకు స్థానమే లేకుండా పోయింది. అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగానే ఈ పాదయాత్ర చేపట్టానని, తన పోరాటం ధర్మపోరాటమని చంద్రబాబు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలోని 8 గ్రామాల గుండా ఆయన నడక సాగించారు.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంత అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అన్ని రకాల ధరలు ఆకాశన్నంటుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కిరణ్ ప్రభుత్వ అసమర్థ విధానాలు ప్రజలకు శాపంగా మారాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ఆయన కుటుంబసభ్యులు తెలంగాణ పేరుతో ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించేసరికి తమ పీఠం ఎక్కడ కదులుతుందోనని తెరాస నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, తెలంగాణకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+