వైయస్ జగన్‌పై ఈడి కొరడా: 143 కోట్ల ఆస్తుల జప్తు

ఇంతకు ముందు ఈడి వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. తాజాగా ఇప్పుడు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పది కోట్ల రూపాయల విలువ చేసే మ్యూచ్‌వల్ ఫండ్స్‌ను, అయోధ్యా రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్‌నకు చెందిన 133 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడి క్విడ్‌ప్రోకో జరిగినట్లు నిర్ధారణకు వచ్చి ఆస్తులను జప్తు చేసింది. అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ మూడు కంపెనీలపై ఈడి దర్యాప్తు జరుపుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని గ్రీన్ బెల్ట్ ఏరియాలో 135.46 కోట్ల రూపాయల విలువ చేసే భూములను రాంకీ సంస్థ పొందిందని, అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో రాంకీ పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందని ఈడి ఆరోపిస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివిధ కంపెనీలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల, రియల్ ఎస్టేట్ వెంచర్స్, మైనింగ్, సెజ్ వంటివాటిల్లో వెసులుబాట్లు కల్పించారని, ఆ వెసులుబాట్లు పెందిన కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈ దిశగా ఈడి కూడా తన దర్యాప్తును కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications