హేట్ స్పీచ్: గాంధీ ఆస్పత్రికి అక్బరుద్దీన్, వైద్యపరీక్షలు

తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల వ్యవధి కావాలని అక్బరుద్దీన్ గతంలో పోలీసులను కోరారు. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనకు కొద్దిసేపట్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
గాంధీ ఆస్పత్రికి వెళ్లే సమయంలో అక్బరుద్దీన్ మీడియాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు మీడియా తన వద్దకు రావద్దంటూ ఆయన చెప్పారు. గాంధీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
న్యాయపోరాటం సాగించడానికి అక్బరుద్దీన్ సోదరుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఆయన గంటకు పైగా అక్బరుద్దీన్‌తో మాట్లాడారు. అక్బరుద్దీన్ వెంట మజ్లీస్ శానససభ్యులు కొద్ది మంది, కార్యకర్తలు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలకు గంటకు పైగా పట్టవచ్చునని అంటున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద అక్బరుద్దీన్‌కు అనుకూలంగా మజ్లీస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications