హేట్ స్పీచ్: అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి వద్ద హైడ్రామా

Akbaruddin Owaisi
హైదరాబాద్: ద్వేషపూరిత ప్రసంగం విషయంలో మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ డ్రామా మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు మంగళవారం ఉదయం కూడా అక్బరుద్దీన్‌ను ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి రావాలని పోలీసులు ఆయనకు సూచించారు.

కాగా, సోదరుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం ఉదయం అక్బరుద్దీన్ నివాసానికి వచ్చారు. వారిద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు జరిగాయి. తనకు ఆరోగ్యం బాగాలేదని, హాజరు కావడానికి నాలుగు రోజులు గడువు ఇవ్వాలని పోలీసులను కోరిన అక్బరుద్దీన్ తనపై కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టుకు ఎక్కారు.

నిర్మల్ పోలీసులు మంగళవారం ఉదయం అక్బరుద్దీన్‌కు నోటీసులు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తామని పోలీసులు అక్బరుద్దీన్‌కు చెప్పారు. విచారణకు సహకరించాలని వారు కోరారు. సోమవారం సాయంత్రం కూడా నిర్మల్ పోలీసులు అక్బరుద్దీన్‌ను ప్రశ్నించారు. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

అక్బరుద్దీన్ నివాసానికి మజ్లీస్ శాసనసభ్యులు, కార్యకర్తలు చేరుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి సుధీర్ బాబు కూడా చేరుకున్నారు. పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలంటూ మజ్లీస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+