అక్బరుద్దీన్‌కు హెర్నియా: తొడలో బుల్లెట్, ఆరోగ్యం ఓకే

Akbaruddin Owaisi
హైదరాబాద్: మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ హెర్నియా బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు నివేదికను అందించారు. పొట్ట కింది భాగంలో అక్బరుద్దీన్‌కు హెర్నియా ఉందని, దానివల్ల ఆయన ఎక్కువ దూరం నడవలేరని నివేదికలో తేలింది.

అక్బరుద్దీన్ తొడలో బుల్లెట్ ఉందని వైద్యులు చెప్పారు. గతంలో జరిగిన దాడిలో అతని తొడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అది అలాగే ఉంది. కాగా, ఆయన ఎడమ ముంజేతి ఎముకకు గాయం ఉన్నట్లు నివేదికలో తేలింది. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పారు. మజ్లీస్ కార్యకర్తలు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. టిఫిన్ కూడా అందించకుండా అక్బరుద్దీన్‌ను వేధిస్తున్నారని అక్బరుద్దీన్ తరఫు న్యాయవాది ఆరోపించారు.

ఇదిలావుంటే, అక్బరుద్దీన్ వ్యవహారం నేపథ్యంలో సంయమనం పాటించాలని ప్రభుత్వం మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగార్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు చెప్పారు. ఎలాంటి వదంతులను కూడా నమ్మవద్దని పోలీసులు ప్రజలను కోరారు. జంటనగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాదు నుంచి నిర్మల్ వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో భద్రతను పెంచారు.

వరంగల్ రేంజ్ డిజి వెంకటేశ్వర రావు డిజిపి దినేష్ రెడ్డితో మాట్లాడారు. వెంకటేశ్వర రావు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. గాంధీ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి దారుల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. అక్బరుద్దీన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో వెంకటేశ్వరరావు సమాలోచనలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+