చిరుకు అక్బర్ ఇష్యూ సెగ: పోలీసులతో అక్బర్ వాదన

ఏమీ తెలియకుండా పోదని చిరంజీవి అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని అన్నారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. చిరంజీవి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇదిలావుంటే, ద్వేషపూరిత ప్రసంగం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద హిందూ రక్షణ సమితి ధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి, ఆర్ఎస్ఎస్, తదితర సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేస్తారనే వదంతుల నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
వైద్య పరీక్షల అనంతరం అక్బరుద్దీన్‌ను గాంధీ ఆస్పత్రిలో మరో రెస్ట్ రూంకు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయినందున తాను ఇంటికి వెళ్లిపోతానని అక్బరుద్దీన్ పట్టుబట్టారు. పోలీసులు అందుకు నిరాకరించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చే వరకు ఉండాల్సిందేనని వారు ఆయనకు చెప్పారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ అరెస్టు విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications