అర్జున్ ముండా రాజీనామా: అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను గవర్నర్‌కు అందించింది. దీంతో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. తాము ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు జెఎంఎం నేత, ఉప ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ గవర్నర్‌కు తెలిపారు.
మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి అర్జున్ ముండా నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం జరిగింది. శాసనసభ రద్దుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి జెఎంఎం గైర్హాజరయింది. ఒప్పందం మేరకు నాయకత్వ మార్పునకు బిజెపి అంగీకరించకపోవడంతో జెఎంఎం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.
మిత్రపక్షాల నాయకత్వ మార్పు డిమాండ్‌ను ప్రధాన మిత్రపక్షమైన బిజెపి అంగీకరించలేదు. మిత్రపక్షాలతో 28 నెలల చొప్పున అధికారం పంచుకోవడానికి బిజెపి అంగీకరించింది. దాంతో ఇప్పుడు తమకు అధికారం అప్పగించాలని జెఎంఎం డిమాండ్ చేస్తోంది. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడేందుకు బిజెపి నిరాకరించింది.












Click it and Unblock the Notifications