• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అరుణ హత్య: శివకుమార్ ఓ కాలు, ఓ చేయి తొలగింపు

By Srinivas
|

Shiva Kumar
పూణే/హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితుడు శివ కుమార్‌కు వైద్యులు ఎడమ కాలు, కుడి చేతిని తొలగించారు. అరుణ హత్య అనంతరం శివ కుమార్ పూణేకు వెళ్లిన విషయం తెలిసిందే. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతనిని హైదరాబాదుకు తరలిస్తున్న సమయంలో వారం క్రితం రైలులో నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

దీంతో అతనిని పూణే ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. తీవ్రంగా గాయపడటంతో అతని ఒక చేయిని, ఒక కాలును వైద్యులు తొలగించారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా వైద్యులు ఇలా చేశారు. వారం పది రోజుల్లో శివకుమార్‌ను హైదరాబాద్ తరలించేందుకు పోలీసులు మొదట ప్రయత్నించారు. ఇప్పుడు కాలు, చేయి తొలగించడంతో అతనిని హైదరాబాద్ తరలింపు మరింత ఆలస్యం కానుంది.

కాగా నగరంలోని మిత్రుడి ఇంట్లో జరిగిన అరుణ అనే లా విద్యార్థిని హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ కుమార్‌ను గత శుక్రవారం ఉదయం పోలీసులు పూణేలో అరెస్టు చేశారు. అతనిని రైలులో హైదరాబాదుకు తరలిస్తుండగా వేగంగా వెళ్తున్న రైలులో నుండి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేశాడు. రైల్లో నుండి దూకడంతో ఆతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అతనిని పూణే ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

నగరంలోని మిత్రుడి ఇంట్లో జరిగన అరుణ అనే లా విద్యార్థిని హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శివ కుమార్‌ను ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతను అరుణ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలించారు. పూణేలో శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

అరుణ హత్య కేసులో నిందితుని సహచరులు, తల్లిదండ్రులను విచారించిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో అతనిని పూణేలో అదుపులోకి తీసుకున్నారు. అరుణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శివకుమార్ పరారీలో ఉండగా ఈ రోజు అరెస్టు చేశారు. అతను చెన్నైలో గానీ ముంబైలో గానీ తల దాచుకుని ఉండవచ్చునని అనుమానించారు.

శివకుమార్ ఇంట్లోనే అరుణ మరణించింది. అరుణ మృతిపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శివకుమారే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అతను ఫోన్ స్విచ్ఛాప్ చేసి పెట్టాడు. హైదరాబాదులోని చత్రినాకలో మిత్రుడి నివాసంలో 22 ఏళ్ల యువతి అరుణ ఆదివారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది.

మృతురాలిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణగా గుర్తించారు. శివకుమార్ అనే మిత్రుడి నివాసంలో సోమవారంనాడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు.

వారు వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. పడక గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో శివకుమార్ తండ్రి మల్లేష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఇంటిలో నెట్ హాల్ టికెట్ కనిపించింది. హాల్ టికెట్ ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. శివకుమార్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Left Leg and Right Hand of Shiva Kumar chopped by Pune doctors, who is accused in Osmania University student Aruna murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more