ప్లాపు సినిమాకు ప్రచారం: బాబు సెంచరీపై కాంగ్రెస్ సెటైర్

Botsa Satyanarayana - Gandra Venkataramana Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరు ప్లాపయిన సినిమాకు ప్రచారం చేసినట్లుగా ఉందని కాంగ్రెసు పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కరివేపాకుకు పేటెంటులా ఉన్నారని విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రజల్లో తెలుగుదేశం పట్ల, పార్టీ అధ్యక్షుడి పట్ల ఏమాత్రం విశ్వాసం కల్పించలేక పోతోందన్నారు. చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వం పైన విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆయన ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయన మతిభ్రమించి తమ ప్రభుత్వం పైన దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్లాపయిన సినిమాకు ప్రచారం చేసినట్లుగా బాబు తీరు ఉందన్నారు.

బాబుతో చెప్పించుకునే స్థితిలో లేము

పాలన పైన తాము చంద్రబాబుతో చెప్పించుకునే స్థితిలో లేమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం వేరుగా అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతోందంటూ విపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమాన్యులకు కాంగ్రెసు ప్రభుత్వం ఎప్పుడూ నష్టాన్ని కలిగించదన్నారు. ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అన్నారు.

రాష్ట్రంలో 63 లక్షల యూనిట్ల విద్యుత్ కొరత ఉందని బొత్స చెప్పారు. గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుండి తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరిగిందన్నారు. విద్యుత్ కొరత భారీగా ఉందని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రూ.26వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+