భయపడే ప్రసక్తి లేదు: అజ్ఞాతం వీడిన పరిటాల శ్రీరామ్

కాగా పరిటాల శ్రీరామ్‌కు బుధవారం ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు అతనికి ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. కాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. బుధవారం తీర్పు చెప్పింది. అయితే నిన్నటి వరకు శ్రీరామ్ ఆచూకి తెలియలేదు. పరిటాల శ్రీరామ్‌తో పాటు రాఘవేంద్రకు కూడా ముందస్తు బెయిల్ లభించింది.
వడ్డే నాగరాజు, రామకృష్ణ, శ్రీనివాసులుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. కాంగ్రెసు నేత సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారనే ఆరోపణపై శ్రీరామ్‌తో పాటు మరికొంత మందిపై అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోమవారం కూడా శ్రీరామ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సాగింది. కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.
దీనిపై పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో అతనికి బెయిల్ లభించింది. దీంతో అతను ఈ రోజు ధర్మవరం గ్రామీణ పోలీసుల ఎదుట హాజరై బెయిల్ పత్రాలు సమర్పించాడు. అలాగే కోర్టు సూచించిన పూచికత్తు పోలీసులకు సమర్పించాడు. శ్రీరామ్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసులు శ్రీరామ్‌ను కొద్దిసేపు విచారించారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు చేసుకుంటున్న తన పైన కుట్రపూరితంగా కేసులు పెట్టారని విమర్శించారు. తాను ఎలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications