రాయపాటి ఇంటిపై జెఏసి దాడి: 'విభజన ఊహాగానాలే'

సమైక్యవాదిని
వ్యక్తిగతంగా తాను సమైక్యవాదిని అని ఇరవై సూత్రాల పథకం అమలు చైర్మన్ ఎన్.తులసి రెడ్డి కృష్ణా జిల్లాలో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు కారణం కాదన్నారు. విభజనవాదం, సమైక్యవాదం వల్లే అనిశ్చితి ఏర్పడిందన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, చివరి వరకు సమైక్యాంధ్రకే పోరాటం చేస్తానన్నారు. అదే సమయంలో తెలంగాణపై పార్టీదే అంతిమ నిర్ణయం అన్నారు. రాష్ట్రం విడిపోతుందన్న వార్తలు కేవలం ఊహాగానాలే అన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు అంశం పైన తులసి రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో వర్షాలు పడే వరకు విద్యుత్ సంక్షోభం కొనసాగుతుందని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు.
గత దశాబ్దకాలంగా రైల్వే ఛార్జీలు పెంచలేదని దీంతో నూతన ట్రాక్‌లు, బ్రిడ్జిలు నిర్మించడంలో జాప్యం జరుగడం వల్ల ఈ ఛార్జీలు పెంచడం తప్పట్లేదన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదన సరైనదే అన్నారు. రైల్వే ఛార్జీలు పెంచడంలో తప్పు లేదన్నారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచడం మినహా చేసేదేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications