తప్పు పడితే సహించం: తెలంగాణపై అసద్ హెచ్చరిక

తాము తెలంగాణను అడ్డుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలు విడ్డూరమని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను ఉద్దేశించి అన్నారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ మజ్లీస్ రాయల తెలంగాణకు సుముఖత వ్యక్తం చేసింది. తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉంటామని, విభజన అనివార్యమైతే హైదరాబాద్ రాజధానిగా రాయలతెలంగాణను అంగీకరిస్తామని మజ్లీస్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.
ఇదిలావుంటే, అక్బరుద్దీన్ ఓవైసీపై రాజద్రోహం కేసు మోపడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరించుకున్నందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెసుకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. అక్బరుద్దీన్ తప్పు చేశాడా, లేదా అనేది న్యాయస్థానాలు తేలుస్తాయని అసదుద్దీన్ అన్నారు.
అక్బరుద్దీన్ నిర్దోషిగా బయటపడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకోవడంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయి హైదరాబాదులో మతకల్లోలాలను రెచ్చగొట్టడానికి మజ్లీస్ ప్రయత్నిస్తోందని తెరాస నాయకులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications