రాష్ట్రం విడిపోదు, నేను ఎప్పటికీ సమైక్యవాదినే: కావూరి

రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదు కాబట్టే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, నేతలు ఈ విషయమై స్పందించడం లేదని తెలిపారు. కొల్లేరు అంశంపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. అందుకే తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నట్లు చెప్పారు. సబ్ కమిటీ సానుకూల స్పందన వల్లనే తాను తదుపరి కార్యాచరణ తీసుకోలేదని చెప్పారు.
కొల్లేరు ప్రాంత భూముల పరిహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాను చర్చించానని ఆయన చెప్పారు. ఇటీవల తనపై అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసులు చట్టపరంగా నిలవవని ఆయన అన్నారు అన్నారు. ఐదో కాంటూరు ఎగువన ఉన్న చెరువులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. చెరువులను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
ముఖ్యమంత్రితో మాట్లాడానని, సబ్ కమిటీ సానుకూలంగా స్పందించిందని, అయితే సమస్య పరిష్కారం కాకుంటే మాత్రం తాను తిరిగి ఉద్యమిస్తానని ఆయన చెప్పారు. కాగా కావూరి సాంబశివ రావ పైన నాలుగు రోజులక్రితం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఇటీవల కావూరి సాంబశివ రావు సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర సదస్సుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధిష్టానంపై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.












Click it and Unblock the Notifications