జూ.ఎన్టీఆర్ 'హరీ': 'కీ' బాలయ్య, నారా లోకేష్‌లకే

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అందుకు ట్రయల్ వేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా తన రాజకీయ చాతుర్యాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఆయన తెర వెనక ఇప్పటికే పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు ఓ వైపు పాదయాత్ర సాగిస్తూనే మరోవైపు లోకేష్‌కు లైన్ క్లియర్ చేసే పని సాగిస్తున్నారు. తన తండ్రి 15వందల కిలో మీటర్ల పాదయాత్రపై తనకు ఎలాంటి అనుమానం లేదని ట్విట్టర్‌లో లోకేష్ ట్విట్టర్‌లో అన్నాడు. చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేషథ్ ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. పార్టీలో యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా లోకేష్ చురుకైన పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.
తన కుమారుడు లోకేష్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూనే మరోవైపు బావమరిది బాలకృష్ణను కూడా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి శాసనసభకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ జిల్లాలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. లోకేష్ సైతం పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతున్నా, ఆయన మాత్రం ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఒకవైపు తెలంగాణ వాదాన్ని, వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభావాన్ని ఎదుర్కునేందుకు బాలయ్య సినీ గ్లామర్‌ను, లోకేష్ యువ రక్తాన్ని చంద్రబాబు నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం యువతకు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో రాజకీయంగా అవకాశం కల్పించింది . ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ యువనాయకత్వం కొరతను ఎదుర్కుంటోంది. బాలకృష్ణ, లోకేష్ పార్టీలో కీలక పాత్ర పోషించడం వల్ల పార్టీకి ఊపు వస్తుందని అంటున్నారు. బాలకృష్ణ తన కుమారుడిని హీరోగా పరిచయం చేసి, పూర్తి సమయం రాజకీయాల్లో ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications