బాబు తెలంగాణ మాటేమిటి: మల్లాది, నిర్ణయించాక: జెసి

Malladi Vishnu - JC Diwakar Reddy
హైదరాబాద్/అనంతపురం: సమైక్య రాష్ట్రమే తమ నినాదం అన్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు మొగ్గుచూపితే ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని చెప్పిన వారు ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. బాబు ప్రకటనపై వారు పెదవి విప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఒకే చెప్పినందు వల్ల తెలుగుదేశం పార్టీ పేరును తెలంగాణ తెలుగుదేశంగా మార్చుకుంటే సబబుగా ఉంటుందని విమర్శించారు. రాష్ట్ర విభజన పైన తమ పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయితే మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఎక్కువ మంది ప్రజల అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజన జఠిలమైన సమస్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా జఠిలమైన సమస్య అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జిసి దివాకర్ రెడ్డి అన్నారు. విభజన అంశం పైన కేంద్రం ఓ గడువు విధించుకుందని, అప్పటి వరకు తాము వేచి చూస్తామని చెప్పారు. కేంద్రం నిర్ణయం వచ్చాక తాము స్పందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+