దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీప్యాక్, క్యాడర్ అటాక్

హైదరాబాద్: దెబ్బతిన్న బెబ్బులి ఎలా రెచ్చిపోతుందో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీరు అలాగే ఉందంటున్నారు. ఇన్నాళ్లూ సీమాంధ్రలో, తెలంగాణలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇటీవల ఒక్కసారిగా పుంజుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పార్టీకి బాగా ప్లస్ అయింది. బాబు యాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.

అదే సమయంలో అప్పుడప్పుడు హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ పర్యటనలు, త్వరలో కీలక పాత్ర పోషించనుండటం పార్టీలో, అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. బాలయ్య మాస్‌ను బాగా ఆకట్టుకోగలరని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో బాబు తనయుడు నారా లోకేష్ అంతర్జాలాన్ని(ఇంటర్నెట్)ను ఉపయోగించుకొని ఇప్పటికే 'నేనున్నానం'టూ యూత్‌లో క్రేజ్ పెంచుకున్నాడు.

ఆయన ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ట్వీట్స్ యూత్‌లో క్రేజ్ పెంచడమే కాకుండా పార్టీలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. బ్రాహ్మిణి కూడా రాజకీయాల్లో టిడిపికి అండగా నిలుస్తుందనే వాదన తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు సైలెన్స్‌గా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో వారు తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపాల్సి ఉంటుందంటున్నారు. లేదంటే గతంలో టిడిపికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి హరికృష్ణ దెబ్బతిన్న రోజులను గుర్తుకు తెచ్చుకోవాలంటున్నారు. అయితే వారు ఇప్పటి వరకు టిడిపికి అండగానే ఉంటామని ప్రకటించారు. బాలకృష్ణ అంతర్గతంగా పార్టీ పటిష్టతపై ఎప్పటి నుండో దృష్టి సారించారు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

చంద్రబాబు వస్తున్నా మీకోసం తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

మొన్నటి వరకు సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెరాస నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి క్రమంగా పుంజుకుంటోందనే చెప్పవచ్చు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

నారా లోకేష్ ట్వీట్స్ ద్వారా టిడిపిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. బ్రాహ్మణి కూడా బ్యాక్ నుండి టిడిపికి అండగా నిలువనున్నారు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

బాలకృష్ణ ప్రస్తుతం అప్పుడప్పుడు జిల్లాలు చుట్టి వస్తున్నారు. త్వరలో మరింత ఎక్కువ స్థాయిలో ఆయన పర్యటనలు జరుపనున్నారు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

తెలంగాణకు పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టిటిడిపి నేతలు తెరాసతో పాటు విపక్షాలపై దూకుడు పెంచారు. పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

తెలంగాణకు పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర నేతలు కొద్దిగా అసంతృప్తికి లోనయినప్పటికీ.. భావోద్వేగాల నేపథ్యంలో పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నదనే భావన వారిలో కనిపిస్తోంది. కాబట్టి అధినేతను పార్టీని ఇబ్బందులకు గురిచేయకుండా ఉండాలనే భావనలో ఉన్నారు. అందుకే వారు ప్రస్తుతానికి సైలెన్స్ అయ్యారు. అదే సమయంలో పార్టీని కింది స్థాయి నుండి బలోపేతం చేసే పనిలో పడ్డారు. కేంద్రం నిర్ణయం కోసం వీరు వెయిట్ చేస్తున్నారని చెప్పవచ్చు.

దెబ్బతిన్నబెబ్బులి టిడిపి:ఫ్యామిలీ ప్యాక్, క్యాడర్ అటాక్

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు అసంతృప్తితో ప్రస్తుతానికి సైలెన్స్‌గా ఉన్నా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలువక తప్పని పరిస్థితి అనే ధీమాలో తమ్ముళ్లు ఉన్నారు. అయినా ఇప్పటి వరకు వారు టిడిపికి అండగా నిలబడతామనే చెప్పారు. అసంతృప్తి ప్రకటించిన పార్టీకి వ్యతిరేకంగా నడుచుకునే సిగ్నల్స్ మాత్రం దాదాపు ఇవ్వలేదనే చెప్పవచ్చు.

చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్, బ్రాహ్మిణిలు ఇలా ఓ వైపు నారా - నందమూరి కుటుంబం మొత్తం ఓ వైపు పార్టీ కోసం బయటా లోపలా పని చేస్తుంటే ఇన్నాళ్లూ సైలెన్స్‌గా ఉన్న క్యాడర్‌లో ఒక్కసారిగా దూకుడుగా పని చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు తెలంగాణ, జగన్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ, సీమాంధ్రలో పార్టీ నేతలు గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో పడ్డారు.

తెలంగాణకు పార్టీ అనుకూలంగా ప్రకటించడంతో పార్టీ అభిప్రాయాన్ని గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లే పనిలో టిటిడిపి నేతలు పడ్డారు. మరోవైపు సీమాంధ్ర నేతలు పార్టీ వైఖరిపై ఒకింత అసంతృప్తితో ఉన్నారు. అయితే సెంటిమెంట్ దృష్ట్యా బాబు ఆ నిర్ణయం తీసుకున్నారని, దీనిని సీమాంధ్రలోని తమ కార్యకర్తలకు, ప్రజలకు చెబుతూ పార్టీని సైలెన్స్‌గా మరింత పటిష్టపర్చే పనిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+