• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ పాతబస్తీ, అసెంబ్లీల్లో బాంబు కలకలం

By Pratap
|
Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీకి పెద్ద ముప్పు తప్పిందని వార్తలు వచ్చాయి. పాతబస్తీలోని పురానాపూల్ వద్ద ఓ ద్విచక్రవాహనం సీటు కింద అమర్చిన బాంబును పోలీసులు శనివారం గుర్తించినట్లు ప్రచారం జరిగింది. దాన్ని నిర్వీర్యం చేసినట్లు ఆ వార్తల సారాంశం. బ్యాటరీలు, గన్ పౌడర్‌లతో యాక్టివా వాహనం సీటు కింద బాంబును అమర్చిచారని,సకాలంలో పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని, పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారని శనివారం సాయంత్రం టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.

బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, బాంబు లభించినట్లు వచ్చిన వార్తలను వెస్ట్‌జోన్ డిసిపి ఖండించారు. జిలిటెన్ స్టిక్స్‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. బాంబు ఉన్నట్లు జరిగిన ప్రచారం ఓ ఆకతాయి పని అని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, రాష్ట్ర శాసనసభ ఆవరణలో బాంబు కలకలం రేగింది. శాసనసభ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు ఒకతను హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాంబ్ స్క్వాడ్ శానససభ ఆవరణలో తనిఖీలు నిర్వహించింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. శానససభ ఆవరణను, వివిధ పార్టీల శానససభా పక్ష కార్యాలయాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు.

బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాసనసభకు సమీపంలో ఉన్న డిజిపి కార్యాలయానికి శుక్రవారంనాడే భద్రతను పెంచారు. తాజా సంఘటనతో శాసనసభకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

English summary
Bomb scare created havoc in Hyderabad old city and assembly today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more