పరిటాల తనయుడు శ్రీరామ్‌పై, ఇతరులపై రౌడీషీట్

Paritala Sriram
అనంతపురం: కాంగ్రెస్ నాయకుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్య కుట్ర కేసులో నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం డిఎస్పీ నవాజ్ ఖాన్ తెలిపారు. తెలుగుదేశం శానససభ్యురాలు పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌తో పాటు 15మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చార్జిషీట్లు తెరుస్తామని ఆయన చెప్పారు. సుధాకర్ రెడ్డి హత్య కుట్ర కేసులో కదిరి శాసనసభ్యుడిని కూడా విచారిస్తామని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, సుధాకర్ రెడ్డి హత్య కుట్ర కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురిని పోలీసులు రెండువారాల క్రితం పట్టుకోవడం, సుధాకర్‌రెడ్డి హత్య కోసం వచ్చినట్లు వారు వెల్లడించడం సంగతి తెలిసిందే. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు రాఘవేంద్ర అనే మరో వ్యక్తికి జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

పరిటాల శ్రీరామ్ గురువారం ధర్మవరం రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన మరో ఆరుగురిని ధర్మవరం రూరల్ పోలీసులు పట్టుకుని శుక్రవారం రాత్రి ధర్మవరం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు ఎదుట హాజరు పరిచారు.

ఈ నిందితుల్లో ధర్మవరం పట్టణానికి చెందిన అరవ చల పతి, దుర్గానగర్‌కు చెందిన ప్రకాశ్, బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామానికి చెందిన నాగేశ్‌నాయుడు, రామగిరికి చెందిన శ్రీనివాసులు, కుంటిమద్దికి చెందిన శివశంకర్, రామగిరికి చెందిన చలపతి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+