పరిటాల ఫ్యామిలీకి దగ్గర కాబట్టే: ఎమ్మెల్యే కందికుంట

పోలీసుల తీరుపై కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. నాగూర్ హెస్సేన్‌తో తనకు పరిచయం ఉందని, అయితే చాలా రోజులుగా హుస్సేన్‌తో మాట్లాడలేదని ఆయన శనివారం అన్నారు. పరిటాల కుటుంబానికి తాను సన్నిహితుడ్ని కాబట్టే తనను లక్ష్యం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఫాక్షన్‌ను పురికొల్పే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ధర్మవరం శాసనసభ్యుడు వెంకట్రామిరెడ్డి, పెద్ది రెడ్డి కుట్ర కారణంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లాలో బాబాయి, అబ్బాయిల కుట్రలకు తాను బలి కావాలా అని ఆయన అడిగారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. శ్రీరామ్‌పై కేసులు పెడితే శానససభ్యురాలు సునీత ఎంతగా బాధపడుతారో తనపై కేసు పెట్టినా అంతే బాధపడుతారని ఆయన అన్నారు.
కామిరెడ్డి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు 15 మందిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరిటాల శ్రీరామ్‌కు బెయిల్ లభించింది. పరిటాల శ్రీరామ్‌పై చార్జిషీట్ తెరుస్తామని కూడా పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications