'గర్ల్స్‌కు పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు వద్దు, మొబైల్ వద్దు'

ఇళ్ల వెలుపల సెల్ ఫోన్లు పట్టుకుని అమ్మాయిలు తిరగడాన్ని అనుమతించవద్దని కమ్యూనిటీ కుటుంబాలను ఆదేశించినట్లు కమ్యూనిటీ పంచాయతీ కార్యదర్శి హబీబుర్రెహమాన్ చెప్పారు. సెల్ ఫోన్లను అమ్మాయిలు వారి కుటుంబ సభ్యుల మాత్రమే వాడాలని అన్నారు. పాఠశాలలు లేదా కాలేజీల వద్ద అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడకూడదని అన్నారు. దానివల్ల యువకులతో వారు మాట్లాడకుండా చూడడానికి వీలవుతుందని చెప్పారు.
రోడ్లపై జరిగే పెళ్లి ఊరేగింపుల్లో బాలికలు నృత్యాలు చేయకూడదని ఆయన అన్నారు. ఇంటిలోపల అటువంటి ఆంక్షలు ఏవీ లేవని, ఇంటిలో జరిగే కార్యక్రమాల్లో వారు పాడవచ్చు, ఆడవచ్చు అని అన్నారు. కమ్యూనిటీలో భద్రమైన వాతావరణం కోసం ఆంక్షలు అవసరమని అన్నారు. అది అమ్మాయిల భద్రత కోసమేనని అన్నారు.
తమ కమ్యూనిటీలోని అమ్మాయిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలకు సిద్ధపడ్డ సంఘటనలు ఉన్నాయని, ఇది తీవ్రమైన విషయమని, అటువంటి సంఘటనలు జరగకుండా పంచాయతీ ఆంక్షలు పెట్టిందని ఆయన అన్నారు. తాము మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అమ్మాయిలు చదువులకు తాము సుముఖంగానే ఉన్నాయని, సామాజిక కట్టుబాట్లను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications