తెలంగాణ ఇస్తే రాజీనామాలే: గంటా, వస్తుంది: దానం

ఈ నెల 17వ తేదీన హైదరాబాదులో పార్టీలకు అతీతంగా జరిగే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుదని, ఈ మేరకు తమకు సంకేతాలు ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రం విడిపోదనే పూర్తి విశ్వాసం తమకు ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల కల త్వరలోనే సాకారం అవుతుందని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తమకు స్పష్టమైన సంకేతాలున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ చిత్రపటంలో హైదరాబాద్ ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఇతరులు గౌరవించాలని ఆయన అన్నారు. మంత్రులపై వస్తున్న విమర్శలనకు త్వరలోనే సమాధానం వస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్స్తున్నట్లు కేంద్రం నుంచి తమకు సంకేతాలు అందుతున్నాయని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అందరూ అంగీకరించాలని ఆయన కోరారు. హైదరాబాదును పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications