తెలంగాణకు ఓకే కానీ, హైదరాబాద్‌లేకుండా: రాయపాటి

తాము ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదులేని విభజనతో పలు సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేది లోగా తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని తాను భావించడం లేదన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసి తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాదును ఎలా వదులుకుంటామన్నారు. అధిష్టానం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మూడొంతుల మంది ప్రజలు సమైక్యాంధ్రనే అంటున్నారన్నారు. తెలంగాణపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదన్నారు.
మజ్లిస్ పార్టీ కూడా తెలంగాణ కోరుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలో ఏముందో తనకు తెలియదన్నారు. అయితే తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు టిడిపి చెబుతోందన్నారు. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రావాలని లేదన్నారు.












Click it and Unblock the Notifications