రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి: కాంగ్రెసుపై బాలయ్య ఫైర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సొంత ఊరు నారావారిపల్లెలో బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ సందడి చేశారు. ఆదివారంనాడు వారు నారావారిపల్లెకు చేరుకున్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద యెత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది.
నారా లోకేష్ వ్యాపార లావాదేవీలను పక్కన పెట్టి సంక్రాంతి పండుగను ఆటవిడుపుగా ఆనందించారు. స్థానికంగా ఉన్న కుర్రాళ్లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు. చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు పలువురు క్రికెట్ ఆటలో పాల్గొన్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్లల గోపాలకృష్ణా రెడ్డి నారా లోకేష్‌ను కలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీకోసం పాదయాత్రలో ఉన్నారు. బాలకృష్ణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications