తెలంగాణ: బాబుకు లగడపాటి 'కనువిప్పు' స్వాగతం!

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో బాబుకు 'తెలంగాణ-సమైక్యాంధ్ర'పై కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేపట్టి ఆహ్వానం పలుకుతామని మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ మంగళవారం చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబును తాము అడ్డుకుంటామని చెప్పారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతు పలికేలా కనువిప్పు కలిగే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు, టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణలు సమైక్యాంధ్రకు అనుకూలంగా చేసిన పత్రికా ప్రకటలను ప్రదర్శిస్తామన్నారు. చంద్రబాబు చేసింది తప్పని, తన నిర్ణయాన్ని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఆయనపై, టిడిపిపై ఒత్తిడి తెస్తామన్నారు. బాబు యాత్రను అడ్డుకుంటే బట్టలూడదీసి కొడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారని, అది సరికాదన్నారు.
అఖిల పక్ష సమావేశంలో ఇచ్చిన లేఖను టిడిపి వెనక్కి తీసుకునేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొంటారన్నారు. కాగా బాబుకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు రూపొందిస్తున్న లగడపాటి రాజగోపాల్ నేరుగా చంద్రబాబును కలిసి సమైక్యాంధ్ర ఆవశ్యకత వివరించనున్నారని తెలుస్తోంది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications