• search
 • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హేట్‌స్పీచ్‌పై టెస్ట్: అక్బరుద్దీన్ ట్విస్ట్‌కు పోలీసుల కౌంటర్

By Srinivas
|
Akbaruddin Owaisi
అదిలాబాద్: హిందువులకు, హిందూ దేవతలకు వ్యతిరేకంగా చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు తనవి కావని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ట్విస్ట్‌కు మంగళవారం పోలీసులు 'కౌంటర్' వేశారు. అక్బరుద్దీన్ వాయిస్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. వాటిని శాస్త్రీయంగా నిర్ధారించుకునేందుకు నిర్మల్ కోర్టులో ఈ రోజు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాయిస్ అక్బరుదో కాదో తేల్చుకునేందుకు శాస్త్రీయ పరీక్షలకు అనుమతించాలని పోలీసులు కోరారు.

కోర్టు అనుమతిస్తే శాంపిల్స్‌ను ఛండీగఢ్ సిఎస్ఎఫ్ఎల్‌కు పంపిస్తామని వారు కోర్టును కోరారు. ప్రసంగ టేపులను అక్కడకు పంపిస్తే వాయిస్ అక్బరుదో కాదో తేలుతుందన్నారు. దేశం మొత్తం మీద ఛండీగఢ్‌లోనే వాయిస్ రికగ్నైజేషన్ మిషన్ ఉంది. అక్కడే వాయిస్‌ను శాస్త్రీయంగా నిర్ధారించుకుంటారు. గతంలో అక్బరుద్దీన్ పైన దాడి జరిగిన ఘటనలో దాడికి ప్రేరేపించిన వారు ఆ సిడిలోని గొంతు తమది కాదని చెబితే పోలీసులు ఛండీగఢ్ సిఎస్ఎఫ్ఎల్‌లోనే నిర్ధారించారు.

కాగా నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్‌ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది. నిర్మల్ బహిరంగ సభ సిడీని చూపుతూ పోలీసులు ఆయన నుంచి వివిధ అంశాలను రాబట్టేందుకు ప్రయత్నించారు.

సభలో పాల్గొన్న మాట వాస్తవమేనని, అయితే సీడిల్లో గొంతు తనది కాదని ఆయన అన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్‌ను హైదరాబాద్ తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బాలరాజు పోలీసులను కోరారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగా లేదని అంటూ అందువల్ల హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని ఓవైసీ ఆస్పత్రి వైద్యుడు మజరుద్దీన్ అలీఖాన్ సూచించారు.

అయితే, నిర్మల్ పోలీసుల కస్టడీలో ఉన్న మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు తెలిపారు. స్థానిక ఎఆర్ హెడ్ కార్వర్స్‌లో మూడో రోజు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత అభిరుచులు, విద్యాబోధన, రాజకీయ రంగ ప్రవేశం వటి అంశాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.

అక్బరుద్దీన్‌ను కోర్టు అనుమతితో పోలీసులు ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17వ తేదీ ఉదయం పోలీసులు ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల్ సభలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆయనను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

ఆదిలాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
19,91,992
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  79.60%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  20.40%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  15.27%
  ఎస్సీ
 • ఎస్టీ
  22.48%
  ఎస్టీ

English summary
Police have questioned MIM MLA Akbaruddin Owaisi on his alleged hate speech at Nirmal of Adilabad district. He said that the voice in the CD is not belongs to him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more