పెళ్లికి నో: కోడలిని నరికిన మామ, యువతిపై గ్యాంగ్ రేప్

తామిద్దరికీ పెళ్లి చేయాలని శివ కొన్నాళ్లుగా భవ్య తల్లిదండ్రులపై ఒత్తిడి చేశాడు. వయస్సు తదితర కారణాలతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఆమెకు మరొకరితో పెళ్లి చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందన్న ఆక్కసుతో శివ ఈ రోజు భవ్యను నరికాడు. దీంతో భవిత అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
బాలానగర్‌లో గ్యాంగ్ రేప్
హైదరాబాదులోని బాలానగర్‌లో ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఓ యువతి బాలానగర్‌లో ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. సోమవారం సెలవు దినం కావడంతో ఆమె ఇంటి పట్టునే ఉంది. ఆమెకు తెలిసిన ఇద్దరు ఆమెను ఇంటి వరకు వెంబడించారు. తనకు ఇవాళ షాపు లేదని చెప్పినా వినకుండా వారు ఆమెను వెంబడించారు.
ఇంటి వరకు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో వారిద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications