బాలికను రేప్ చేసి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష

వివరాలు ఇలా ఉన్నాయి - ఢిల్లీ శివారులోని కపషేరాలో ఇంటి బయట ఆడుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో దారి తప్పి ఫామ్‌హౌస్ వైపు వెళ్లింది. ఫామ్ హౌస్ విధుల్లో ఒంటరిగా ఉన్న సింగ్ ఆ బాలికను పిలిచాడు. ఆమెను రేప్ చేసి హత్య చేశాడు. ఈ సంఘటన 2011 ఏప్రిల్ 10వ తేదీన జరిగింది.
బాలిక మరణించిందని గుర్తించిన సింగ్ ఆమె మృతదేహాన్ని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది. బాలిక కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత బాలిక మృతదేహం ఫామ్ హౌస్ సమీపంలో కనిపించింది.
రేప్ చేసిన తర్వాత మరణించిన బాలిక మృతదేహాన్ని ఫామ్‌హౌస్‌లో ఎవరూ చూడని ప్రదేశంలో సింగ్ పడేశాడు. ఫామ్ హౌస్ వెలుపల రోడ్డు నిర్మాణం జరుగుతుండడంతో వారు చూస్తారనే భయంతో అతను భయపడి మృతదేహాన్ని ఫామ్‌హౌస్ పరిధిలోనే పడేశాడు.












Click it and Unblock the Notifications