జగన్‌ను తప్పించేందుకే సంతకాలు: విజయమ్మపై బాబు

Chandrababu Naidu
ఖమ్మం: అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన తన కుమారుడు వైయస్ జగన్‌ను తప్పించేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సంతకాలు సేకరించి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తన కుమారుడు జగన్ నిజాయితీపరుడని విజయమ్మ నిరూపించగలరా అని ఆయన అడిగారు. సంతకాలు సేకరిస్తే కేసులు మాఫీ అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని నర్సింహాపురం, రాయిగూడెం గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్ జగన్‌కు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని మోసగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అలాంటివారికి ఓట్లు వేసి వ్యవస్థను దిగజార్చవద్దని ఆయన ప్రజలను కోరారు.

తనను గుర్తు పెట్టుకుని పెద్ద కొడుకులా సేవ చేస్తానని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ అమలు చేస్తానని, బెల్టు షాపులు రద్దు చేస్తానని, డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్‌తో బిసి డిక్లరేషన్‌కు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్ని కులవృత్తులవారికి ఉపాధి చూపిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించి మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా దాడి చేశారు. రాష్ట్రంలో దోపిడీ దొంగల ప్రభుత్వం నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ సర్‌చార్జీలు, చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం ప్రజలను దోచుకోవడమేనని ఆయన అన్నారు. నిన్నటి దాకా రూపాయికి కిలో బియ్యం అన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మన బియ్యం అంటూ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+